APPSC GROUP 1,2 Notification Release 2021 | Latest GROUP 1,2 Notification | Group-1,2 Total Posts 1,180 Posts Details
APPSC GROUP - 1,2 NOTIFICATION 2021
_____________________________
APPSC నిర్వహించు గ్రూప్ - 1 పరీక్ష మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్ కు ఇకమీదట ప్రిలిమ్స్ పరీక్ష ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు తెలిపారు. ఇకమీదట ఏ.పీ.పీ.ఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఎ.పీ.పీ.ఎస్సి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పూర్తికి ఏడాది లేదా ఆ పై సమయం పడుతోందని, త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామనరు. ఇక మీదట రాబోయ్యే నోటిఫికేషన్లకు ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్లు కూడ అమలు చేస్తామనీ తెలిపారు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని తెలియ జేశారు. కోర్టు పరిధిలో ఉన్నందు వలన పాలిటెక్నిక్ లెక్చరర్లు మరియు గ్రూప్ -1 నియామకాలను పూర్తి చేయలేకపోయామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ - 1 మరియు గ్రూప్- 2 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఇప్పటి వున్న 1,180 ఖాళీ పోస్టులను మేము గుర్తించాం వీటిలో గ్రూప్ 1,2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి అంటు తెలియజేశారు. పోస్టులు పెంచి ఈ ఆగస్టులో గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం, ఆగస్టులో నోటిఫికేషన్ ప్రకటించే నాటికి ఎన్ని ఖాళీలు వస్తే అన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అంటు తెలియజేశారు. వచ్చే ఆగస్టులో చెప్పుకోదగ్గ రీతిలో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.. అభ్యర్థుల యొక్క వయోపరిమితిని కూడా 47ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన వినతులను వెంతనే పరిశీలించి ప్రభుత్వానికి పంపాము అంటు తెలియ జేశారూ . ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటాము అదేవిధమూగ ఇకపై 3-4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తాము అనీ తెలిపారు. ఉద్యోగాల సాధన కోసం విజయవాడలోని ఏ.పీ.పీ.ఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన వారిపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించారు. నిరుద్యోగులపై నమోదు చేసిన కేసులు కూడా ఎత్తివేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకే కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నాము అని తెలిపారు.
Comments
Post a Comment