Agriculture Bill of Talk | Agricultur Bill of Uses | Vavssaya bill Challanges | Agricultur Bill Aginest Challenges
వ్యవసాయ బిల్లు పై ప్రజల అలోచన తీరు __ www.smteluguspoorthi.com __ ఏ రకపు సరుకు తయారీ కోసం అయినా, దాని కోసం అవసరమయ్యే ఉత్పత్తి సాధనాల్ని తయారు చేసిన శ్రమలూ, ఆ సాధనాల్ని వాడుతూ తర్వాత జరిగే శ్రమలూ, అన్నీ కలిసినవే కొత్తసరుకు కోసం జరిగే మొత్తం శ్రమలు అవుతాయి. ఆ మొత్తం శ్రమల కాలమే, ఆ కొత్త సరుకుకి విలువ. ఆ విలువని బట్టే, ఆ సరుకుకి ‘ధర’ ఏర్పడాలి. వ్యవసాయ సరుకులకైనా, పెట్టుబడిదారీ పరిశ్రమల సరుకులకైనా, వాటి తయారీకీ, వాటి విలువలకీ, ఒకే రకంగా, అదే సూత్రం. వ్యవసాయరంగానిక సంబంధించి కేంద్రప్రభుత్వం ఈ మధ్య కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాలు వ్యవసాయదారులకు చాలా మేలు చేస్తాయని ప్రభుత్వమూ, చాలా హాని చేస్తాయని రైతు సంఘాల వారూ, వాద వివాదాలతో ఉన్నారు. దాదాపు పదిరోజుల నుంచీ, వేలాదిమంది రైతులు పంజాబునుంచీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ల నుంచీ ఢిల్లీ చుట్టుపట్లకు చేరి, ఎముకలు కొరికే చలిలో బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. రైళ్ళు నడవకపోవడం వల్ల, ఢిల్లీకి దూరంగా ఉన్న రాష్ట్రాల రైతులు రాలేక పోయినా, వాళ్ళున్న చోట్లే వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన కొత్త చట్టాల వివరాలనూ, వాటికి సంబంధించిన వాద...