Skip to main content

ఇంటర్ తర్వాత ఎలాంటి గ్రూప్ లు తీసుకోవాలి | Ofter 12th Class Study Groups | OFTER INTERMEDIATE Choose Better Courses

 12వ. తరగతి ( ఇంటర్) తరువాత చదివే చదువులు 

(Ofter 12th Class (INTER) Study Courses)


కోర్సులు ( Courses ) :


➡️ఇంజినీరింగ్

➡️ఎంసెట్

ఎంసెట్ రాయకపోయినా

➡️ జేఈఈ – మెయిన్, జేఈఈ అఢ్వాన్స్ డ్

➡️ట్రిపుల్ ఐటీలు

➡️ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా

➡️ఐ.ఇ.టి.ఇ


మెడిసిన్ ( MEDICINE) :

➡️ఎం.బి.బి.ఎస్.

➡️పారామెడికల్

➡️ఫార్మా-డి

➡️బి.డి.ఎస్.

➡️కామర్స్

➡️మేటి ఆర్ట్స్ బాటలు

➡️ఫ్యాషన్‌ డిజైనింగ్‌

➡️ఆడియో విజువల్‌ మీడియా


కామర్స్ కోర్సులు ( COMMERCE COURSE) :

➡️ఐ.సి.ఎ.ఐ

➡️ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ.

➡️బి.కాం.

➡️బి.బి.ఎ. బి.బి.ఎం.

➡️స్టాక్ మార్కెట్ అధ్యయనం

➡️సర్టిఫికెట్ ఇన్ అకౌంటింగ్ టెక్నీషియన్స్


ఆధునిక కోర్సులు :

➡️టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్

➡️డిజాస్టర్ మేనేజ్ మెంట్

➡️ఫ్యాషన్ టెక్నాలజీ

➡️ఫైర్ ఇంజినీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్


విదేశీ భాషలు Other Countries Longuages) :


➡️సోషల్ వర్క్‌

➡️జియాలాజికల్‌సైన్స్


వ్యవసాయ కోర్సులు ( AGRICULTURE COURSES) :

➡️ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

➡️డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయా

➡️శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయా


న్యాయవిద్య ( LAW COURSES):


➡️బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

➡️లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్' (లాసెట్)

➡️క్లాట్‌

➡️ఉస్మానియా లా కళాశాల

➡️లా యూనివర్సిటీ

➡️భవిష్యత్తు

➡️దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ

➡️ఇంటిగ్రేటెడ్ కోర్సులు

➡️ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ

➡️యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ద్రవిడ యూనివర్సిటీ

➡️యోగి వేమన వర్సిటీ, నన్నయ వర్సిటీ

➡️సెంట్రల్ వర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్

➡️ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం


ఉద్యోగాలు ( JOBS) :


➡️ఏవియేషన్ కేడర్ అబ్జర్వర్

➡️త్రివిధ దళాలు

➡️రైల్వే ఉద్యోగాలు

➡️పోలీస్ కానిస్టేబుల్

➡️బ్యాంకింగ్ రంగం


ఇతరములు ( OTHERS)  :


➡️జేఈఈ అడ్వాన్స్‌డ్ -2015లో మార్పులు

➡️ఎంసెట్‌లలో మెరవాలంటే


ఇంటర్మీడియట్ తరువాత ఏమి చేయవచ్చు.?


➡️ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాతా విద్యార్థులు మెడిసిన్ , ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవాలన్నా , సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా , రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. 
➡️ ఇంటర్ తరువాత ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ.  ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి: 
ఉన్నత విద్య  మరియు ఉపాధి. ఈ రెండిట్లో ఏది అవసరమో ఎంచుకునేందుకు పలు రకాల పరిస్థితులు దోహదం చేస్తాయి. అంత త్వరగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేనివాళ్లు ఉన్నత విద్యవైపు దృష్టి సారిస్తారు. ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉంటే ఉద్యోగంలో చేరడం తప్పనిసరి కదా.

ఇంజినీరింగ్ విద్య ( ENGENEERING ):


➡️ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మక్కువ చూపేది ఇంజినీరింగ్ పైనే కాబట్టి, ఏటా ఇంజినీరింగ్‌కు వైపు అయిన ఎంసెట్‌కు లక్షల్లో పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా కూడా  పోటీ మాత్రం తగ్గడంలేదు. ఉన్నతమైన భవిష్యత్తుకు స్థిరమైన బాటను వేస్తున్న ఇంజినీరింగ్ అంటే తల్లిదండ్రుల్లోనూ ఆసక్తి ఎక్కువే ఉంటుంది.
ఇంజినీరింగ్ చేయడానికి జాతీయ , రాష్ట్రస్థాయుల్లో అనేక అవకాశాలు ఉన్నాయి.
మన పొరుగు రాష్ట్రాల్లో చదవాలంటే కూడా
కర్ణాటక , తమిళనాడు మహారాష్ట్ర , ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వ , ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ర్యాంక్ ఆధారంగా ముందు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చి తరువాతనే  మిగతా రాష్ట్రాల వారికి సీట్లు కేటాయించడం జరుగుతుంది.
➡️ జాతీయస్థాయి పరీక్షలు
జాతీయ స్థాయిలో ఐ.ఐ.టి., ఎన్.ఐ.టి. , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ , బిట్స్ లాంటి సంస్థలు అత్యున్నత సాంకేతిక పరికరాలతో, ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఇంజినీరింగ్ , మెడికల్, ఇతర డిగ్రీ , పీజీ కోర్సులను అందిస్తున్నాయి.
అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల ద్వారా వీటిలో సీటు లభిస్తుంది.
జాతీయ స్థాయి పరీక్షలకు... సహజంగా డిసెంబరు - జనవరిలో ప్రకటనలు వస్తాయి. పరీక్షలు ఏప్రిల్ , మే, జూన్‌లో జరుగుతాయి.
రాష్ట్రస్థాయి పరీక్షలకు ప్రకటనలు జనవరి - ఫిబ్రవరి మధ్య వస్తాయి. పరీక్షలు మే, జూన్‌లలో ఉంటాయి. అడ్మిషన్లు జూన్, జులైల్లో మొదలవుతాయి.


ఎంసెట్ గురించి (ABOUNT EMCET) :

విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరాలంటే ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. మంచి ర్యాంక్ తెచ్చుకుంటే కోరుకున్న కాలేజీలో సీటు వస్తుంది. రాష్ట్రంలో కొన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో తప్ప ఇంజినీరింగ్ డిగ్రీ చేయాలంటే ఏకైక మార్గం - ఎంసెట్.
ఇంజినీరింగ్ , అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - ఎంసెట్ పూర్తి రూపం. జె.ఎన్.టి.యు. ఎంసెట్‌ను నిర్వహిస్తుంది.
ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని ఇంజినీరింగ్, వ్యవసాయ, వైద్య కళాశాలల్లో చేరవచ్చు.

కోర్సులు:

_________

➡️ బి.ఇ./ బి.టెక్.
➡️ బి.వి.ఎస్‌సి. అండ్ 
➡️ఎ.హెచ్./ బి.ఎస్‌సి.(అగ్రి) / బి.ఎస్‌సి.(హార్టికల్చర్)/ బి.ఎఫ్.ఎస్‌సి./ బి.టెక్. (ఎఫ్ఎస్.అండ్ టి)/ బి.ఎస్‌సి. (సి.ఎ.అండ్ బి.ఎం.)
➡️ ఎం.బి.బి.ఎస్ / బి.డి.ఎస్. / బి.ఎ.ఎం.ఎస్. / బి.హెచ్.ఎం.ఎస్ / బి.ఎన్.వై.ఎస్.
➡️ బి.ఫార్మా/ బి.టెక్(బయోటెక్నాలజీ), ఫార్మా-డి (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ).

అర్హతలు:
_________

 విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. ఇతర కోర్సుల్లో చేరేందుకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి.

విద్యార్థులు ఎంసెట్ రాయకపోయినా, సీటు సాధించలేకపోయినా ఇంజినీరింగ్ కలగానే మిగలాల్సిన పనిలేదు. మరెన్నో మార్గాలు ద్వార ఈ కోర్సు చేయడానికి ఉన్నాయి. అనుకోని కారణాల వల్ల ఎంతోమంది ఇంజినీరింగ్ చదవలేకపోతున్నారు. అంతమాత్రాన ఆ లక్ష్యం అక్కడితో ఆగిపోవాల్సిన అవసరంలేదు,ఇంజినీరింగ్‌తో సమానమైన డిగ్రీని అందించే సంస్థలు ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన విద్యార్థులకు రెగ్యులర్ ఇంజినీరింగ్ డిగ్రీతో సమానమైన గుర్తింపు ఉంది.
వీరు అన్ని రకాల పరీక్షలకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. దేశంలో ప్రస్తుతం అనేక‌ సంస్థలు రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సులతో సమానమైన ప్రత్యామ్నాయ కోర్సులను నిర్వహిసున్నాయి. ఇవి బి.ఇ./ బి.టెక్, డిప్లొమా సర్టిఫికెట్‌లను ప్రదానం చేస్తున్నాయి.
మెకానికిల్ కూడా రంగంలో భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన నిపుణులను తీర్చిదిద్దడానికి 1914లో భారత్‌లో మొట్టమొదట ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా - ఐ.ఎం.ఇ.ఐ.) ఏర్పడింది. తరువాత 1920లో ఆవిర్భవించిన ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) వృత్తి నిపుణులను అందించడంలో ప్రముఖ సంస్థగా పేరు గాంచింది.
ఈ సంస్థలు అందించే కోర్సుల్లో తమకు నచ్చిన వాటిని విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం విద్యార్థులు తాము చేరదలుచుకున్న కోర్సుకు సంబంధించిన సంస్థలో మొదట తమ పేరు నమోదు చేసుకోవాలి. వీరిని స్టూడెంట్ మెంబర్‌గా పిలుస్తారు. ఆ తర్వాత ఆయా సంస్థలు నిర్వహించే పరీక్షలతోపాటు , ప్రాక్టికల్ పరీక్షల్లో కూడా అర్హత పొందితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇస్తారు.
డిగ్రీ అందుకున్న వారిని కార్పొరేట్ మెంబర్ గా గుర్తిస్థారు.

IIIT :


➡️ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ [ఐటీ] మార్కెట్‌కు కావాల్సిన సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దడానికి ఏర్పడినవే ట్రిపుల్ ఐటీలు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ). 1998 - 2000 మధ్య కాలంలో వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి ట్రిపుల్ ఐటీని హైదరాబాద్‌లోనే నెలకొల్పారు.

మొత్తం కేంద్రాలు: 

1). ఐ.ఐ.ఐ.టి. హైదరాబాద్
2). బెంగళూరు 
3). ట్రిపుల్ ఐటీ అండ్ మేనేజ్‌మెంట్, గ్వాలియర్
4). ఐ.ఐ.ఐ.టి. అండ్ ఎం. కేరళ. 
5). పుణే 
6). అలహాబాద్ 
7). భువనేశ్వర్ 
8). ఢిల్లీ 
9). ఐ.ఐ.ఐ.టి. డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్, కాంచీపురం
10). ఐ.ఐ.ఐ.టి డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, జబల్‌పూర్.
హైదరాబాద్, బెంగళూర్‌ల్లోని ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నడుస్తుంటే, మిగతావి మొత్తంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అందుకనే ఈ రెండు సంస్థలు 2004 - 05 సంవత్సరం నుంచి పూర్తిస్థాయి యూనివర్సిటీలుగా మారిపోయాయి. యు.జి.సి. సలహా ప్రకారం వాటి పేరును 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్' నుంచి 'ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్'గా మార్చుకున్నాయి. వీటిలో చేరడానికి కూడా ఎ.ఐ.ఇ.ఇ.ఇ. రాయాల్సిందే. ట్రిపుల్ ఐటీల్లో (IIIT) ప్రవేశానికి నవంబర్, డిసెంబర్‌లలో ప్రకటనలు వెలువడతాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో మరో మూడు ట్రిపుల్ ఐటీలు బాసర, నూజివీడు, ఇడుపులపాయల్లో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి పదో తరగతి సరిపోతుంది.

జేఈఈ(JEE MAINS And ADVANCED) – మెయిన్, జేఈఈ అఢ్వాన్స్ డ్ :

➡️ భారతదేశం( INDIA) సాంకేతికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు నిపుణుల కొరత చాలా ఎక్కువగా ఉంది. మౌలిక వనరులు, ముడి పదార్థాలు పుష్కలంగా ఉన్నా సరైన పద్ధతిలో ఉపయోగించి దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే మానవ వనరులే తక్కువగా ఉన్నాయి. దీనివల్ల నిర్ణీత అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే చాలా సమయం పడుతోంది. నిపుణులను తీర్చిదిద్దితే దేశ పురోగతి వేగంగా సాగుతుందనే సంకల్పంతో ఐ.ఐ.టి.(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లకు అంకురార్పణ జరిగింది.
దేశంలో తొలిసారిగా 1950లో ఖరగ్‌పూర్‌లో మొట్టమొదటి ఐ.ఐ.టి.ని ఏర్పాటు చేశారు. తదనంతరం విద్యార్థుల సంఖ్యకు, అవసరాలకు తగినట్లు అనేక ఐ.ఐ.టి.లు వచ్చిచేరాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 ఐ.ఐ.టి. (IIT) లు పనిచేస్తున్నాయి. అదనంగా బెనారస్ హిందూ యూనివర్సిటీని కూడా ఐ.ఐ.టి.గా మార్చడంతో ఈ సంఖ్య 16కి చేరింది.

ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా Aeronautical Society of India) :-

➡️1948లో ఏర్పడిన ఈ సంస్థ అసోసియేట్ మెంబర్ షిప్ ఎగ్జామ్ ఇన్ ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా (ఎ.ఎం.ఎ.ఇ.ఎస్.ఐ)' నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తోంది. ఇది బి.టెక్.(ఏరోనాటికల్ ఇంజినీరింగ్)తో సమానం.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50% (శాతం) మార్కులుండాలి. ప్రతి సంవత్సరం రెండుసార్లు అసోసియేట్ మెంబర్‌షిప్ పరీక్ష నిర్వహిస్తోంది. దీన్లో రెండు సెక్షన్లు (ఎ, బి) ఉంటాయి.

సెక్షన్-ఎ( SECTION - A) :


➡️మొత్తం 10 కంపల్సరీ/ తప్పని సరి పేపర్లు ఉంటాయి. అన్నీ తప్పనిసరిగా రాయాలి.
సెక్షన్-బి: సెక్షన్-ఎ పాసైనవారు మాత్రమే ఈవిభాగానికి అర్హులు. పరీక్షలు ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. అన్ని పేపర్లలో అర్హత పొందిన వారిని ఎ.ఎం.ఎ.ఇ.ఎస్.ఐ.గా గుర్తిస్తుంది.

Comments

Post a Comment

Popular posts from this blog

వెంకాయ పల్లె ఎల్లమ్మ పూర్వ చరిత్ర | Yellamma Prehistoric | Kurnool Ellamma Temple Prehistoric | Yellamma Temple Charitra

   వెంకాయ పల్లె ఎల్లమ్మ పూర్వ చరిత్ర / VENKAYA PALLE YELLAMMA PREHISTORIC KURNOOL( Andhra Pradesh- INDIA ) ______________________________________________       కర్నూలు జిల్లా పరిధిలోని వెంకాయపల్లె ఎల్లమ్మ దేవస్థానం అనగానే ప్రతీ మంగళవారం మరియు శుక్రవారం ఎల్లమ్మ దేవస్థానానికి ప్రజలు దూర ప్రాంతాల నుండి తండోప తండాలుగు తరలి వస్తుంటారు అమ్మవారి ఆశీశుల / దీవెనల కోసం. ఎందుకు ఇంత జనాభా రావడాకి కారణం తెలుసుకునే ముందు ఈ ఎల్లమ్మ దేవస్థానం యొక్క పూర్వ చరిత్ర ఎమీటో తెలుసుకోవాలసిన అవసరం ఉంది.      కర్నూలు జిల్లా వెంకాయ పల్లే గ్రామం నివాసిరాలు అయినా పాపమ్మ అనే యువతి తన పొలం లో పనులు చేసుకుంటు జీవనం సాగించే వారు. కానీ ఒకనాడు అకస్మాతుగా పూనకం వచ్చి ఊగిపోతూ ఈ ప్రాంతాన నేను ఇంకి ఉన్నాను అంటూ ఆమె పొలం ప్రక్కన ఉన్న ఈత చెట్ల మద్యలోకి వెల్లి పూనకంతో ఊగిపోతు ఇక్కడ నేను ఉన్నాను నాకు గుడి నిర్మించి పూజలు జరిపించండి అని చెప్పిందని కొందరు తెలిపినట్టి విషయం.  అంతే కాదు పాపమ్మతో పాటుగా పని చేస్తున్న తోటి మహిళలు అయిన మాదిగ కులస్తులైన వీరికి దగ్గర నీటి బుడగలు రావడంతో ఆచర్యపో...

ANDHRA PRADESH GOVERNMENT JOBS NOTIFICATIONS | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు వివరాలు

ANDHRA PRADESH GOVT. JOBS NOTIFICATIONS ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు ===================================== 1). ● పోస్ట్ తేదీ/POST DATE : 07-07-2020 ● RECRUITMENT BOARD : GOVT. GERAL HOSPITAL ANANTAPUR . ● POST NAME : Staff Nurse Physical Director & Other - 182 Posts ● Qualification : GNM , Diploma , Degree , PG ● LAST DATE : 22 - 07 - 2020 ● FOR DETAILS :  Click Here     Jobs Detiles Information VIDEO ________________________________ 2). ● POST DATE : 7-7-2020 ● RECRUITMENT BOARD  : WCD Dept VISAKHA PATNAM  ●POST NAME : AYAH , Music Teacher & Other - 24 Posts  ● QUALIFICATION : 10th , Degree , Diploma  ● LAST DATE : 10- 07-2020 ● FOR DETAILS :  Click Here Jobs Detiles Information VIDEO 3). ● POST DATE : 10 - 07-2020 ● RECRUITMENT BOARD  :GOVT. Genral Hospital   KADAPA . ● POST NAME : Research Assistant Data Entry Operater - 9 Posts ● QUALIFICATION : Any Degree...